కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 8 డిసెంబర్ 2014 –14 నవంబర్ 2014

20 Questions | Total Attempts: 125

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 8 డిసెంబర్ 2014 –14 నవంబర్ 2014

Questions and Answers
 • 1. 
  భోపాల్ దుర్ఘటనకు 30 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ‘భోపాల్: ఏ ప్రెయర్ ఫర్ రెయిన్’ చిత్రం విడుదల అయింది. ఈ దుర్ఘటనకు కారణమైన సంస్థ ఏది?
  • A. 

   గెయిల్ ఇండియా

  • B. 

   యూనియన్ కార్బైడ్

  • C. 

   రిలయన్స్ పెట్రోకెమికల్స్

  • D. 

   ఏది కాదు

 • 2. 
  డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాపరినిర్వాన్ దివస్ ను నిర్వహించారు? ఆయన అందుకున్న అత్యున్నత భారతదేశ పౌర పురస్కారం ఏది?
  • A. 

   భారతరత్న

  • B. 

   పద్మశ్రీ

  • C. 

   పద్మభూషణ్

  • D. 

   పద్మవిభూషణ్

 • 3. 
  ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ స్పేస్ పోర్ట్ నుండి 7 డిసెంబర్ 2014న భారత సమాచార ఉపగ్రహం జీ శాట్-ను విజయవంతంగా ప్రయోగించారు. ఇద ఎన్నవ జీశాట్ ఉపగ్రహం?
  • A. 

   జీ శాట్-14

  • B. 

   జీ శాట్-15

  • C. 

   జీ శాట్-17

  • D. 

   జీ శాట్-16

 • 4. 
  శ్రీలంక క్రికెటర్ కుమార్ సంగక్కర, 3 డిసెంబర్ 2014న వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఆయన ఈ ఘనతను సాధించిన ఎన్నవ బ్యాట్స్‌మన్‌గా రికార్డును సృష్టించారు?
  • A. 

   రెండవ బ్యాట్స్‌మన్‌

  • B. 

   మూడవ బ్యాట్స్‌మన్‌

  • C. 

   నాల్గవ బ్యాట్స్‌మన్‌

  • D. 

   ఐదవ బ్యాట్స్‌మన్‌

 • 5. 
  ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ దేశాలు ఆతిధ్యం వహించే 2015 ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ కు ఏ సంస్థ గ్లోబల్ పార్టనర్ గా వ్యవహరించనుంది?
  • A. 

   సహారా గ్రూప్

  • B. 

   కామన్వెల్త్ బ్యాంకు

  • C. 

   ఎం.అర్.ఎఫ్ లిమిటెడ్

  • D. 

   నైక్ గ్రూప్

 • 6. 
  అనుమతి లేని ఆరోగ్యకేంద్రాల నిర్వహణ పై ఏ రాష్ట్ర ప్రభుత్వ నిషేధం విధించింది. ఉచిత కంటి చికిత్సా శిబిరాల్లో 16 మంది పాక్షిక అంధత్వానికి గురికావడం ఈ నిషేధానికి గల కారణం?
  • A. 

   హర్యానా

  • B. 

   ఉత్తరప్రదేశ్

  • C. 

   ఛత్తీస్ గడ్

  • D. 

   పంజాబ్

 • 7. 
  29వ పూణే అంతర్జాతీయ ఫుల్ మారథాన్ విజేత అమోస్ మెయింది. ఆయన ఏ దేశానికి చెందిన వారు?
  • A. 

   కెన్యా

  • B. 

   ఇథియోపియా

  • C. 

   జమైకా

  • D. 

   ఘనా

 • 8. 
  రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన గ్రిహనంధన్ సింగ్, 7 డిసెంబర్ 2014న న్యూఢిల్లీలో మరణించారు. ఆయన ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు?
  • A. 

   టెన్నిస్

  • B. 

   రైఫిల్ షూటింగ్

  • C. 

   హాకీ

  • D. 

   క్రికెట్

 • 9. 
  భారతదేశం, 7 డిసెంబర్ 2014న అతిపెద్ద జాతీయ పతాక మానవహారంతో గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ మానవహారాన్ని ఏ నగరంలో నిర్వహించారు?
  • A. 

   బెంగళూరు

  • B. 

   చెన్నై

  • C. 

   నోయిడా

  • D. 

   న్యూఢిల్లీ

 • 10. 
   ఏ రాష్ట్ర ప్రభుత్వం, 5 డిసెంబర్ 2014న లోక్ ప్రియ గోపీనాథ్ బొర్డోలోయ్ పేరు మీద నూతన రోడ్డు నిర్మాణ పథకాన్ని ప్రారంభించింది?
  • A. 

   మేఘాలయ

  • B. 

   మణిపూర్

  • C. 

   అస్సాం

  • D. 

   నాగాలాండ్

 • 11. 
  3 డిసెంబర్ 2014న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ‘స్విస్ అంబాసిడర్ అవార్డు’ను అందుకున్నది ఎవరు?
  • A. 

   రతన్ టాటా

  • B. 

   అజీం ప్రేమ్‌జీ

  • C. 

   గ్లెన్ సాల్దంహా

  • D. 

   ముకేష్ అంబానీ

 • 12. 
  తొలిసారిగా 200 వనమూలికలతో తయారుచేసిన పవిత్ర గ్రంధం ‘ఖురాన్’ను, 8 డిసెంబర్ 2014న ఎక్కడ ఆవిష్కరించారు?
  • A. 

   దుబాయ్

  • B. 

   న్యూయార్క్

  • C. 

   న్యూఢిల్లీ

  • D. 

   ఇస్లామాబాద్

 • 13. 
  బీజింగ్ కు చెందిన చైనా మెషినరీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (సిఎంఈసి) సంస్థ 6 డిసెంబర్ 2014న ఏ దేశంలో మెగా వాటర్ సప్లై ప్రాజెక్టును ప్రారంభించింది?
  • A. 

   టిబెట్

  • B. 

   శ్రీలంక

  • C. 

   భారతదేశం

  • D. 

   పాకిస్థాన్

 • 14. 
  భారత రాజ్యాంగం యొక్క మొదటి అరబిక్ అనువాదాన్ని, 9 డిసెంబర్ 2014న ఎక్కడ ఆవిష్కరించారు?
  • A. 

   న్యూఢిల్లీలో

  • B. 

   లండన్ లో

  • C. 

   ముంబైలో

  • D. 

   కైరోలో

 • 15. 
  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 8 డిసెంబర్ 2014న రైల్వే రంగంలో సవరించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గరిష్ఠ పరిమితిని ఎంత శాతానికి అనుమతించింది?
  • A. 

   50 శాతం

  • B. 

   80 శాతం

  • C. 

   100 శాతం

  • D. 

   10 శాతం

 • 16. 
  పరమాణు జీవశాస్త్రవేత్త జేమ్స్ డి వాట్సన్, జన్యువుల నిర్మాణాన్ని కనుగొన్నందుకు గాను వచ్చిన నోబెల్ ప్రైజ్‌ను వేలం వేసి వార్తల్లో నిలిచారు. ఆయన ఏ సంవత్సరంలో వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్‌ను అందుకున్నారు?
  • A. 

   1960లో

  • B. 

   1961లో

  • C. 

   1962లో

  • D. 

   1963లో

 • 17. 
  రాబర్ట్ ముగాబే, 9 డిసెంబర్ 2014న ఉపాధ్యక్షురాలైన జోయ్స్ ముజురును ఆమె పదవి నుండి తప్పించారు. రాబర్ట్ ముగాబే ఏ దేశ అధ్యక్షుడు?
  • A. 

   కెన్యా

  • B. 

   జింబాబ్వే

  • C. 

   దక్షిణాఫ్రికా

  • D. 

   నైజీరియా

 • 18. 
  భారత మాజీ షూటర్ రణధీర్ సింగ్, ఏ అంతర్జాతీయ కమిటి (ఐఓసి) లో గౌరవ సభ్యుడిగా నియామకమయ్యారు?
  • A. 

   అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి

  • B. 

   అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్

  • C. 

   అంతర్జాతీయ క్రికెట్ మండలి

  • D. 

   భారత ఒలింపిక్ సంఘం

 • 19. 
   ఫ్రాన్స్ దేశ క్రీడాకారిణి గ్లాడీస్ నోసెరా, 6 డిసెంబర్ 2014న ఢిల్లీలో జరిగిన 2014 హీరో విమెన్స్ ఇండియన్ ఓపెన్‌ను గెల్చుకుంది. ఆమె ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి?
  • A. 

   టెన్నిస్

  • B. 

   హాకీ

  • C. 

   గోల్ఫ్

  • D. 

   బాడ్మింటన్

 • 20. 
  శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, తన నైరుతి ఆసియా కేంద్ర కార్యాలయ అధ్యక్షుడిగా హ్యున్ చిల్ హోంగ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ దేశానికి చెందిన కంపెనీ?
  • A. 

   సింగపూర్

  • B. 

   చైనా

  • C. 

   భారత్

  • D. 

   దక్షిణకొరియా

Back to Top Back to top