కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 12 డిసెంబర్–18 జనవరి 2015

28 Questions | Total Attempts: 99

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 12 డిసెంబర్–18 జనవరి 2015

Questions and Answers
  • 1. 
    తరుణ్ రాయ్, 14 జనవరి 2015న జే వాల్టర్ థాంప్సన్ సంస్థ యొక్క దక్షిణాసియా విభాగ ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సిఈఓ)గా నియమితులయ్యారు. జే వాల్టర్ థాంప్సన్ సంస్థ ఏమిటి?
    • A. 

      ఎలక్ట్రానిక్స్ సంస్థ

    • B. 

      ఇన్సూరెన్స్ సంస్థ

    • C. 

      ఆటోమొబైల్ సంస్థ

    • D. 

      అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సంస్థ

  • 2. 
    ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా, 15 జనవరి 2015న గన్నవరం (విజయవాడ) నుంచి న్యూఢిల్లీకి నూతన విమాన సర్వీసును ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
    • A. 

      ముంబై

    • B. 

      న్యూఢిల్లీ

    • C. 

      చెన్నై

    • D. 

      హైదరాబాద్

  • 3. 
    ఫిబ్రవరి మరియు మార్చి 2015లో జరిగే పదకొండవ ఐసిసి క్రికెట్ ప్రపంచకప్ పోటీలకు ఏ ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి?
    • A. 

      ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్

    • B. 

      ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్

    • C. 

      శ్రీలంక మరియు ఇండియా

    • D. 

      న్యూజీలాండ్ మరియు ఇంగ్లాండ్

  • 4. 
    హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు, 2014 సంవత్సరంలో 41.58 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్ కాపిటలైజేషణ్ తో ప్రపంచంలోని 50 విలువైన బ్యాంకులలో ఒకటిగా గుర్తింపును సాధించింది. రెల్ బ్యాంక్స్ సంస్థ జనవరి 2015లో విడుదల చేసిన ఈ జాబితాలో, ఈ బ్యాంకు ఏ స్థానంలో నిలిచింది?
    • A. 

      45వ స్థానంలో

    • B. 

      46వ స్థానంలో

    • C. 

      47వ స్థానంలో

    • D. 

      48వ స్థానంలో

  • 5. 
    భారతదేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్ అనే తేలికపాటి విమానాన్ని, 17 జనవరి 2015న భారత వైమానిక దళానికి అందజేశారు. ఈ విమానాన్ని ఏ తరం సాంకేతికతను ఉపయోగించి రూపొందించారు?
    • A. 

      మొదటి తరం సాంకేతికత

    • B. 

      రెండవ తరం సాంకేతికత

    • C. 

      మూడవ తరం సాంకేతికత

    • D. 

      నాల్గవ తరం సాంకేతికత

  • 6. 
    దక్షిణాఫ్రికా జట్టు సారధి అబ్రహం బెంజిమిన్ (ఏబి) డివిలియర్స్, 18 జనవరి 2015న ఏ జట్టు పై మరియు ఎన్ని బంతుల్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశారు?
    • A. 

      31 బంతుల్లో

    • B. 

      30 బంతుల్లో

    • C. 

      36 బంతుల్లో

    • D. 

      37 బంతుల్లో

  • 7. 
    కాళోజీ ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయానికి తొలి రిజిస్ట్రార్‌గా, 17 జనవరి 2015న డాక్టర్ బక్క రాజు, బాధ్యతలను చేపట్టారు. ఈ ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏ జిల్లాలో నెలకొల్పారు?
    • A. 

      కరీంనగర్

    • B. 

      వరంగల్

    • C. 

      హైదరాబాద్

    • D. 

      నల్గొండ

  • 8. 
    భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన కోచ్‌గా, 16 జనవరి 2015న స్టీఫెన్‌ కాన్‌స్టంటైన్‌ రెండోసారి నియమితులయ్యారు. ఆయన ఏ దేశానికి చెందిన వారు?
    • A. 

      ఇంగ్లండ్‌

    • B. 

      జర్మనీ

    • C. 

      భారతదేశం

    • D. 

      ఆస్ట్రేలియా

  • 9. 
    ది రెడ్ శారీ, ఎ డ్రమటైజ్‌డ్ బయోగ్రఫీ ఆఫ్ సోనియా గాంధీ అనే పుస్తకాన్ని భారతదేశంలో, రోలి బుక్స్ ప్రచురణ సంస్థ 16 జనవరి 2015న విడుదల చేసింది. ఈ పుస్తక రచయిత ఎవరు?
    • A. 

      నట్వర్ సింగ్

    • B. 

      మారియో ఫ్యూజో

    • C. 

      జేవియర్ మోరో

    • D. 

      మారియో జోరో

  • 10. 
    సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, స్వాతంత్ర సమరయోధుడు ఘెలుభాయి నాయక్, 16 జనవరి 2015న ఎక్కడ మరణించారు?
    • A. 

      మహారాష్ట్ర

    • B. 

      రాజస్థాన్

    • C. 

      గుజరాత్

    • D. 

      ఉత్తరప్రదేశ్

  • 11. 
    నాసా మరియు ఎన్ఓఏఏ సంస్థ 16 జనవరి 2015న విడుదల చేసిన రెండు వేర్వేరు అధ్యయనాల (విశ్లేషణ) ఫలితంగా ఏ సంవత్సరం, 1880 మొదలు భూమి పై అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది?
    • A. 

      2012

    • B. 

      2014

    • C. 

      2010

    • D. 

      పైవేవీ కాదు

  • 12. 
    భారతీయ రిజర్వ్ బ్యాంకు, 15 జనవరి 2015న 2014-15 ఆరవ ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనను ప్రకటించింది. ఇది (రెపో రేటున) ఎంత శాతం తగ్గించింది?
    • A. 

      0.75 శాతం

    • B. 

      0.35 శాతం

    • C. 

      0.25 శాతం

    • D. 

      0.50 శాతం

  • 13. 
    కేంద్ర ప్రభుత్వం, జనవరి 2015 రెండవ వారంలో వారణాసి-క్యోటో భాగస్వామ్యం కింద అభివృద్ధి చేయాల్సిన ఐదు అంశాలను గుర్తించింది. క్యోటో నగరం ఏ దేశంలో ఉంది?
    • A. 

      చైనా

    • B. 

      అమెరికా

    • C. 

      మలేషియా

    • D. 

      జపాన్

  • 14. 
    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 8 జనవరి 2015న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన ఘటనకు 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎక్కడ స్మారక పోస్టేజ్ స్టాంపులను విడుదల చేశారు?
    • A. 

      న్యూఢిల్లీ

    • B. 

      గాంధీనగర్

    • C. 

      ముంబై

    • D. 

      అహ్మదాబాద్

  • 15. 
    నాసాకు చెందిన కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్, 6 జనవరి 2015న, 1000వ ఎక్సోప్లానెట్‌ను కనుగొంది. నాసా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
    • A. 

      వాషింగ్టన్ డి.సి

    • B. 

      న్యూయార్క్

    • C. 

      కాలిఫోర్నియా

    • D. 

      కొలంబియా

  • 16. 
    ఎన్‌ఎఫ్‌ఎల్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 14 జనవరి 2015న ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ప్రారంభించేందుకు ఒప్పందం పై సంతకం చేశాయి. రామగుండం ఏ జిల్లాలో ఉంది?
    • A. 

      వరంగల్

    • B. 

      మెదక్

    • C. 

      అదిలాబాద్

    • D. 

      కరీంనగర్

  • 17. 
    స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. స్వామి వివేకానంద జన్మదినోత్సవం ఎప్పుడు?
    • A. 

      జనవరి 11

    • B. 

      జనవరి 12

    • C. 

      జనవరి 13

    • D. 

      జనవరి 14

  • 18. 
    ప్రసిద్ధిగాంచిన భాషా పండితుడు ప్రభునాథ్ ద్వివేది, 14 జనవరి 2015న ఏ భాషలో 2014 సాహిత్య అకాడెమీ అవార్డును గెల్చుకున్నారు?
    • A. 

      మైథిలి

    • B. 

      హిందీ

    • C. 

      మణిపురి

    • D. 

      సంస్కృత

  • 19. 
    లీలా శాంసన్, 16 జనవరి 2015న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు, ఆమె ఎవరు?
    • A. 

      భరతనాట్య నాట్యకారిణి

    • B. 

      ప్రసిద్ధ తమిళ చిత్ర నటి

    • C. 

      వయోలిన్ విద్వాంసురాలు

    • D. 

      కూచిపూడి నాట్యకారిణి

  • 20. 
    భారత ఓపెన్ వాటర్ స్విమ్మర్ భక్తి శర్మ, 14 జనవరి 2015న ఏ మహాసముద్రంలో 52 నిమిషాల్లో 1.4 మైళ్లను ఈది, నూతన ప్రపంచ రికార్డును నెలకొల్పింది?
    • A. 

      అంటార్కిటిక్ మహాసముద్రంలో

    • B. 

      ఆర్కిటిక్ మహాసముద్రంలో

    • C. 

      పసిఫిక్ మహాసముద్రంలో

    • D. 

      హిందూ మహాసముద్రంలో

  • 21. 
    14 జనవరి 2015న భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) యొక్క నూతన  చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా  ఎవరు నియమితులయ్యారు?
    • A. 

      A.N రాయ్

    • B. 

      అనుపమ్ శ్రీవాస్తవ

    • C. 

      ముకుల్ రాయ్

    • D. 

      అనుపమ్ ఖేర్

  • 22. 
    హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం బాబా రాందేవ్ ను 15 జనవరి 2015న నియమించింది. ఈ నియమకానికి ఈ క్రింది వాటికి వాటిలో ఏది హర్యానా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది?
    • A. 

      వేదం అభివృద్ధి

    • B. 

      యోగ అభివృద్ధి

    • C. 

      క్రీడాభివృద్ధి

    • D. 

      ఆరోగ్యాభివృద్ధి

  • 23. 
    15 జనవరి 2015న భారతదేశ ఎన్నికల ప్రధాన కమీషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
    • A. 

      వి ఎస్ సంపత్

    • B. 

      అలుర్ సీలిన్ కిరణ్‌కుమార్

    • C. 

      హరి శంకర్ బ్రహ్మ

    • D. 

      పైవారు ఎవరు కాదు

  • 24. 
    12 జనవరి 2015న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
    • A. 

      అలుర్ సీలిన్ కిరణ్‌కుమార్

    • B. 

      కే. రాధాకృష్ణన్

    • C. 

      శైలేష్ నాయక్

    • D. 

      జి మాధవన్ నాయర్

  • 25. 
    2015 సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డును ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  (IAMAI) 13 జనవరి 2015న ఎవరికీ బహుకరించింది?
    • A. 

      షారుఖ్ ఖాన్

    • B. 

      అమితాబ్ బచ్చన్

    • C. 

      సల్మాన్ ఖాన్

    • D. 

      నరేంద్ర మోడీ

Back to Top Back to top